విరాళాల వెల్లువ

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. సి.ఎం రిఫిలీప్ ఫండ్ కు వ్యక్తిగత సహాయంగా ఒక కోటి 116 రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి ఆయన అందించారు. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సిఎంఆర్ఎఫ్ కు రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి పివి కృష్ణారెడ్డి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. కెఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహరెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ కంపెనీ తరుఫున కోటి రూపాయల చెక్కును సిఎంఆర్ఎఫ్ కు అందించారు. లారస్ ల్యాబ్స్ సిఇఓ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ చేరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తమ ల్యాబ్ తరుఫున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. సిఎంఆర్ఎఫ్ కు రూ.50 లక్షల చెక్కును సిఎంకు అందించారు. హైదరాబాద్ కు చెందిన మీనాక్షి గ్రూప్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందివ్వడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి కెటి రామారావుకు సంస్థ చైర్మన్ కె.ఎస్.రావు, ఎండి. సి.శివాజి అందించారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ‘క్రెడాయ్’ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ప్రగతి భవన్ లో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావుకు సంస్థ ప్రతినిధులు అందించారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడే నాలుగు వేల ఎన్ 95 మాస్కులను GPK ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ యజమానులు ఫణి కుమార్ , కర్నాల శైలజా రెడ్డి గురువారం నాడు ఐటీ , మున్సిపల్ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రగతి భవన్ లో అందజేశారు . కరోనా వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలకడంతో పాటు, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడడంతో పాటు, వారు చూపించిన స్పూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహం ఇస్తుందని సిఎం అన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!