ఒకే కాన్పులు మూడు దూడలు

ఒక ఆవు ఒకే సారి మూడు దూడలకు జన్మనిచ్చింది. కృష్ణాజిల్లా పామర్రు మండలం ఉరుటూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారుమూరి పరశురామిరెడ్డికి చెందిన ఒంగోలు జాతి ఆవుకు ఒకే సారి మూడు దూడలకు జన్మనిచ్చింది. ఈ మూడు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయి. ఒకటి కోడె దూడ కాగా , మిగిలిన రెండు పెయ్య దూడలు. హర్మోన్ల ప్రభావం లేదా అండం చుట్టు ఉన్న రక్షణ వలయం బలహీనంగా మారడం వల్ల కానీ వీర్య కణాలు ఎక్కువగా ఫలదీకరణ చెందాయని డాక్టర్ల చెపుతున్నారు. దీని వల్లనే మూడు దూడలకు ఆవు జన్మనిచ్చిందని వైద్యులు అంటున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!