విజయవాడ మేయర్ అభ్యర్థి కేశినేని నాని కూతురు

రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడటానికి యువనాయకురాలు పార్టీ జెండా పట్టుకోనున్నారు. విజయవాడ మేయర్ పీఠమే ధ్యేయంగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తున్నారు. విజయవాడ ఎం.పి కేశినేని నాని కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేషన్ బరిలోకి దిగడానికి రెఢీ అయ్యారు. ఆమె విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ నుంచి టీడీపీ తరుపున కార్పొరేటర్ గా పోటీ చేయనున్నారు. విజయవాడ మేయర్ పదవి జనరల్ మహిళ అయిన నేపథ్యంలో శ్వేత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండటం విశేషం. ఆమెనే టీడీపీ మేయర్ అభ్యర్థి అయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. టాటా పౌండేషన్ లో శ్వేత కీలక స్థానంలో ఉన్నారు. ఆమె వివాహనికి రతన్ టాటా స్వయంగా వచ్చి ఆశ్వీరదించారు. గత ఎన్నికల్లో నాని తరుపున శ్వేత ప్రచారం చేశారు కూడా. ఇప్పుడు ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగడంతో నాని వారసత్వం ఖరారైంది. విజయవాడలో 75 శాతం స్థానాలను కైవసం చేసుకుంటామని ఇప్పటికి నాని ప్రకటించారు. తన కూతురే మేయర్ అభ్యర్థి కానున్నడంతో ఆయన మరింత యాక్టివ్ గా పనిచేయనున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!