కాంగ్రెస్ కు జ్యోతిరాధిత్య రాజీనామా

కాంగ్రెస్ పార్టీ మరో సారి సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. రాజీనామా లేఖను సింథియా తన ట్విట్టర్ లో ఉంచారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత ఆయన రాజీనామాను ప్రకటించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో వర్గవిభేదాల నేపథ్యంలో సింథియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్ తో తీవ్ర విభేదాల కారణంగా సింథియా చాలా కాలం నుంచి అసంత్రుప్తి ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుపడుతు తన అసమ్మతిని చూపిస్తున్నారు. అయితే కమల్ నాథ్ కాని, కాంగ్రెస్ అధిష్టానం కాని సింథియాను పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీని వదలాలని నిర్ణయం తీసుకున్నారు. పదిహేనుయేళ్ల బీజేపీ పాలనను తొలగించి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ యేడాదిలోనే అంతర్గత కుమ్ములాటలతో కూలిపోవడానికి సిద్ధమైంది. సింథియా పార్టీని వీడటాన్ని మధ్యప్రదేశ్ తో పాటు దేశంలో కూడా కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బగా చూడాలి. జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు సింథియా కుమారుడే జ్యోతిరాధిత్య సింథియా. మాధవరావు మరణంతో జ్యోతిరాధిత్య 18 యేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా సింథియా రాజేకు జ్యోతిరాధిత్య మేనల్లుడు కావడం విశేషం. సమీప బంధువులైనప్పటికి వీరి మధ్య సంబంధాలు లేవు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!