మారుతీరావు…ఓ పరువు ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో సంచలనం స్రుష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆయన ఉరివేసుకున్నాడు.పోలీసుల వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇటీవల మారుతీరావుకు చెందిన షెడ్డులో డెడ్ బాడీ దొరకడంతో మరో సారి ఆయన వార్తల్లోకి వచ్చాడు. ఈ కేసు విచారణలో భాగంగానే మారుతీరావును పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మారుతీరావు నల్గొండ జిల్లా మిర్యాలగూడాకు చెందిన వ్యాపారవేత. తన కూతురు అమ్రుత అదే పట్టణానికి చెందిన ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అగ్రకులానికి చెందిన మారుతీరావు తన కూతురు ఒక దళితుడిని పెళ్లి చేసుకోవడాన్ని భరించలేకపోయాడు. ప్రణయ్ ను బీహార్ కు చెందిన కిరాయి హంతుకుడితో హత్య చేయించాడు. మిర్యాలగూడా నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించింది. దళిత సంఘాలు, మహిళా సంఘాలు అమ్రుతకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఈ కేసులో అరెస్టు అయిన మారుతీరావుకు చాలాకాలం జైలులోనే ఉన్నారు. బెయిల్ పైన ప్రస్తుతం బయటకు వచ్చిన ఆయన మిర్యాలగూడాలో ఉంటున్నాడు. తన కూతురు అమ్రుతను బెదిరించేందుకు ప్రయత్నించడంతో ఇటీవల మరో సారి ఆయనపైన కేసు నమోదైంది. ఆస్తంతా రాసిస్తానని, కేసు వెనక్కు తీసుకోమని ఆయన మరొకరితో రాయబారం పంపించారు. అయితే అమ్రుత ఎదురుతిరగడంతో మారుతీరావుకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆయన షెడ్డులో గుర్తు తెలియన డెడ్ బాడీ దొరడంతో మరో సారి ఆయన వార్తల్లో నిలిచారు. మారుతీరావుకు కుమార్తె అమ్రుతకు పోలీసుల భద్రత కల్పిస్తున్నారు. మారుతీరావు నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీని కొనసాగిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!