బిగ్ బాస్ రాహుల్ పైన దాడి

బిగ్ బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పైన దాడి జరిగింది. తలకు తీవ్రగాయంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీరు బాటిల్ తో రాహుల్ తల మీద కొట్టడంతో గాయాలపాలైనట్లు సమాచారం. పబ్ లో జరిగిన గొడవ కారణంగా ఆయనపైన దాడి జరిగినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి రాహుల్ వెళ్లారు. అయితే కొంత మంది యువకులు రాహుల్ ఫ్రెండ్ తో అనుచితంగా వ్యవహారించడంతో వీరి మధ్య గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రాహుల్ తలపైన బీరు సీసాలతో కొట్టడంతో ఆయనకు తీవ్రరక్తస్రావం అయినట్లు చెపుతున్నారు. దాడికి పాల్పడిన యువకులు తాాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బంధువులని తెలుస్తోంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన రాహుల్ ఇటీవల పలు సినిమా పాలు పాడారు. క్రిష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండ సినిమాలో రాహుల్ నటిస్తున్నారు.

 

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!