రేవంత్ రెడ్డి సోదరుడికి యాక్సిడెంట్

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి టిప్పర్ లారీ దూసుకువచ్చింది. డ్రైవర్ అప్రమత్తతతో తిరుపతిరెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఆయన కారు వెనకాలే వస్తున్న అనుచరుల కారును టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగంగా బాగా దెబ్బతిన్నది. తిరుపతిరెడ్డి కారు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు కిందకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు విశాలంగా ఉన్నప్పటికి ప్రమాదం జరగడం మీద అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు ఖాళీగా ఉందని, కావాలనే టిప్పర్ కారుపైకి దూసుకువచ్చినట్లు అనిపిస్తోందని స్థానికులు చెపుతున్నారు. కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలను తిరుపతిరెడ్డినే పర్యవేక్షిస్తుంటారు. రేవంత్ రెడ్డి తరుపున అన్ని పనులను ఆయనే చక్కబెడతారు. ఈ క్రమంలోనే ఆయనను అడ్డు తప్పించడానికి ప్రయత్నం జరిగి ఉండవచ్చునన్న అనుమానాలను రేవంత్ వర్గం వ్యక్తం చేస్తోంది. తనకు ప్రాణ హాని ఉందని ఇటీవలే రేవంత్ రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ భద్రత కాకుండా కేంద్ర ఆధీనంలోని బలగాలతో తనకు రక్షణ కల్పించాలని ఆయన కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ యాక్సిడెంట్ జరగడం విశేషం.ప్రమాదంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!