కేసీఆర్ ను గద్దె దించుతా

సి.ఎం కేసీఆర్ ను గద్దె దించేంత వరకు పోరాటం చేస్తానని ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. సెక్రటేరియట్ కు తాళాలు వేసి మంత్రులను జనం కలవకుండా చేశారని ఆయన ధ్వజమెత్తారు. పల్లెప్రగతి పేరుతో నిధులను ఖర్చు పెట్టించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రగతి అంటు హడావుడి చేస్తోందని కోమటిరెడ్డి విమర్శించారు. చేర్యాల రెవిన్యూ డివిజన్ కోసం పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చేర్యాలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. 20 రోజుల్లో రెవిన్యూ డివిజన్ ప్రకటించకపోతే ఆమరణ నిరాహరదీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!