రేవంత్ రెడ్డి పట్నం గోస

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎం.పి రేవంత్ రెడ్డి యాత్ర చేయబోతున్నారు. పట్నం గోస పేరుతో ఆయన ఏడు రోజుల పాటు తన నియోజకవర్గంలో పర్యటిస్తారు. డబల్ బెడ్ రూం ఇళ్ల వైఫల్యంమే ప్రధాన ఎజెండాగా ఆయన బస్తీల్లో తిరుగుతు ప్రజలను కలవనున్నారు. ఈ కార్యక్రమానికి వినూత్నంగా పట్నం గోస అన్న పేరును ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నది. రోజుకో నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మల్కాజ్ గిరి అసెంబ్లీ నుంచి ఈ కార్యక్రమం మొదలు కానున్నది. 25న ఎల్.బి.నగర్, 26న ఉప్పల్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారు. 27న కుత్భుల్లాపూర్, 28న కూకట్ పల్లిలో ఆయన టూర్ ఉండనున్నది. 29న కంట్మోనెంట్ లో పాదయాత్రతో పట్నం గోస ముగియనున్నది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా భారీ ఎత్తున పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. మల్కాజ్ గిరి ఎం.పిగా విజయం సాధించిన తర్వాత మొదటి సారి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు మరో యేడాది వస్తున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడంపైన ఆయన ద్రుష్టి సారించారు. స్థానిక నాయకులు, కార్యకర్తల్లో విశ్వాసం కల్పించడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగనున్నది. దీంతో పాటు సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని మరింత గట్టిగా ప్రశ్నించే అవకాశం వస్తుంనది ఆయన భావిస్తున్నారు. పట్నం గోస కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏడు శాసనసభ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కేడర్ సిద్ధమౌతోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!