ఎవరీ రెడ్డి ఐపిఎస్..సిట్ చంద్రబాబు కోసమేనా..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైసీపీ సర్కార్ వెంటాడుతోంది. ఆయన చుట్టు ఉచ్చు బిగించడమే లక్ష్యంగా జగన్ అనేక స్కెట్ లు గీస్తున్నారు. అవినీతి ఆరోపణలతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారు. అమరావతి నుంచి అనేక కార్యక్రమాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటున్న వైసీపీ ప్రభుత్వం విచారణల పేరుతో హడావుడి చేస్తోంది. ఇఫ్పటికే చంద్రబాబు సర్కార్ నిర్ణయాలపైన మంత్రి వర్గ ఉపసంఘం పనిచేస్తోంది. అనేక ఫైళ్లను వడపట్టి మాజీ సి.ఎంను బోనులో నిలబెట్టాలని తీవ్రంగా పనిచేస్తోంది. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని జగన్ సర్కార్ తీసుకుంది. మంత్రి వర్గ ఉపసంఘం , శాసనసభ స్పీకర్ సూచనల మేరకు ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. ఇంటలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేత్రుత్వంలో సిట్ చంద్రబాబు సర్కార్ అన్ని నిర్ణయాలపైన విచారణ జరపబోతోంది. సిట్ కు విశేష అధికారులు ఇస్తు జగన్ ఆదేశాలు జారీ చేశారు.

సిట్ కథా కమామిషు.. వి.ఎస్.ఆర్ వ్యూ పాయింట్ లో చూడండి

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!