తెలంగాణ మంత్రిని దోచేసిన దొంగలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను దొంగలు దోచేశారు. అవును మీరు చదివేది నిజం. స్వయంగా ఆయన చేతికున్న కడియాన్నే కొట్టేశారు. మెడలో దండలు వేస్తు అందినకాడికి దండుకున్నారు. అభిమానం పేరుతో శ్రీనివాస్ గౌడ్ కు ప్రీతిపాత్రమైన బంగారు కడియాన్ని కాజేశారు. దీంతో మంత్రి మౌనంగా ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సొంత జిల్లాలోనే ఈ చేదు అనుభవం ఎదురైంది. ఓ పెళ్లి వేడుకలో పాల్గొనడం కోసం ఆయన దేవరకద్రకు వెళ్లారు. మంత్రి వస్తున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ఆయనను కలవడానికి జనం పోటీ పడ్డారు. కొందరు సెల్పీలు దిగుతు సందడి చేశారు. అంతా అయిపోయాక చూస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతికున్న బంగారు కడియం కనిపించకుండా పోయింది. దీంతో ఆయన కంగుతినాల్సి వచ్చింది. చేతి కడియాన్ని దొంగలు ఎలా కొట్టేశారని శ్రీనివాస్ గౌడ్ ఆశ్చర్యానికి లోనయ్యారు. విషయం పోలీసులకు చేరడంతో వారు కంగారుపడుతున్నారు. మంత్రి గారి కడియాన్ని వెతికి పట్టుకోవడానికి దేవరకద్ర పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ గుంపులో దొంగ కోసం అన్వేషిస్తున్నారు. మంత్రిగారిని నిలువునా దోచేసిన దొంగను చూడాలని అంతా ఆసక్తిగా ఉన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!