సరికొత్త డిస్కవరీ స్పోర్ట్స్ కారు

టాటా మోటార్స్ తన లగ్జరీ కార్ల విభాగంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ సరికొత్త కారును విడుదల చేసింది. బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కారు స్పోర్ట్స్ వినియోగ దారులను ఆకట్టుకుంటోంది. ఈ డిస్కవరీ స్పోర్ట్స్ కారు పెట్రోల్ మరియు డీజిల్ విభాగాల్లో లభ్యమౌతోంది. ప్రీమియం ఎల్ ఈడీల హెడ్ లైట్లు, పగలు కూడా పనిచేసే లైట్లు, రేర్ ఎల్ ఈడీ లైట్స్ తో పాటు యానిమేటేడ్ సూచికలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గత డిస్కవరీ ఎడిషన్ల కంటే ఈ స్పోర్ట్స్ కారును మరిన్ని హంగులతో తీర్చిదిద్దినట్లు జాగ్వార్ కంపెనీ చెపుతోంది. ఈ కారు ప్రారంభ ధర 57.06 లక్షల నుంచి 60 లక్షల ( ఎక్స్ షో రూం ధర ) వరకు ఉంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!