ట్రంప్ చేతులు మీదగా మొతెరా

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం భారతదేశంలో రూపుదిద్దుకుంటోంది. ఏకంగా లక్షా పదివేల మంది కూర్చొని మ్యాచ్ చూసే అవకాశం ఈ స్టేడియానికి ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మొతెరా మైదానం సిద్ధమైంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ స్టేడియాన్ని ప్రారంబించనున్నడంతో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. భారత పర్యటనకు వస్తున్న ట్రంప్ ఈ నెల 24న ఈ స్టేడియాన్ని ఓపెన్ చేస్తారు. ఇందు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్టేడియంలోనే లక్షమందిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కోసం అహ్మదాబాద్ ను తీర్చిదిద్దుతున్నారు. ఎయిర్ పోర్టు నుంచి మొతెరా స్టేడియం వరకు వేలాది మంది ట్రంప్ కు ఘనస్వాగతం పలకనున్నారు. ట్రంప్ మొతెరాను ప్రారంభిస్తున్న నేపథ్యంలో స్టేడియంపైన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఒక సారి ఈ స్టేడియం ప్రత్యేకతలేమిటో చూద్దాం..

అహ్మదాబాద్ లోని పురానత సర్దార్ పటేట్ స్టేడియాన్ని కూల్చి వేసి అక్కడే మొతెరా మైదానాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 63 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియాన్ని ఏర్పాటు చేశారు.ఎంసీసీని డిజైన్ చేసిన ఎం.ఎస్. పాపులస్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ మొతెరాకు రూపకల్పన చేసింది. దీని నిర్మాణం కోసం ఏకంగా 700 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ప్రపంచంలోనే అత్యధికం వ్యయంతో నిర్మితమైన క్రికెట్ స్డేడియం మొతెరానే కావడం మరో విశేషం. క్రికెటర్లను ప్రాక్టీస్ కోసం ఇండోర్ నెట్స్ తో పాటు 6 పిచ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టేడియంలో 76 కార్పొరేట్ బాక్స్ ను ఏర్పాటు చేశారు. ప్లేయర్స్ కోసం నాలుగు డ్రస్సింగ్ రూంలను నిర్మించారు. ఏకంగా మూడు వేల కార్లు, 10 వేల మోటార్ సైకిళ్లను ఈ స్టేడియంలో పార్కింగ్ చేయవచ్చు. మొతెరాలో అత్యాధునిక డ్రైనేజీ సిస్టంను ఏర్పాటు చేశారు. ఎంత వర్షం వచ్చినా కేవలం 30 నిమిషాల్లోనే నీరంతా బయటకు వెళ్లిపోయేలా తీర్చిదిద్దారు. ఈ స్టేడియంలో ఒకే సారి 1,10,000 లమంది కూర్చొని మ్యాచ్ ను చూడొచ్చు. మెల్ బోర్న్ లోని ఎంసీసీ స్టేడియం 100000 మంది కెపాసిటీతో ఇప్పటి వరకు నెంబర్ వన్ గా ఉండేది. ఇప్పుడు మొతెరా దాని రికార్డును తారుమారు చేసింది. పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఈ స్టేడియం ఫస్ట్ ఫ్లోర్ కు చేరుకోవచ్చు. ఇదే సమయంలో స్టేడియంలో ఏ మూలన కూర్చున్నప్పటికి మైదానంలో ఆటను స్పష్టంగా చూడొచ్చు. ఇలాంటి రికార్డులున్న మొతెరాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభిస్తున్నారు. మార్చిలో ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ తో మొతెరాలో క్రికెట్ మొదలుకానున్నది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!