మళ్ళీ మేకప్ వేసుకున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల బాట పట్టారు. ఎన్నికల్లో ఘోరపరాజయం నేపథ్యంలో ఆయన మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పింక్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఒక వైపు అమరావతిపైన అసెంబ్లీలో అత్యంత కీలకమైన చర్చ, మరో వైపు రైతుల తీవ్ర ఆందోళనలు చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులను వాళ్ల మాానాన వాళ్లను వదిలేసి షూటింగ్ కు వెళ్లడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తు అమరావతిపైన జగన్ సర్కార్ కు మద్దతు ప్రకటించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!