చిరిగిన చొక్కాతో ఎం.పి గల్లా

అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపు తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. రాజధాని ప్రాంత రైతులు అసెంబ్లీ వైపు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య పెద్ద ఎత్తున తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఖాకీలు లాఠి ఛార్జికి దిగడంతో పలువురు మహిళలు, రైతులు గాయపడ్డారు. ఈ క్రమంలోనే గుంటూరు ఎం.పి గల్లా జయదేవ్ రైతులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి దూసుకువచ్చారు. పొలాల నుంచి వచ్చే క్రమంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు రూరల్ ఎస్పీ జయరావు స్వయంగా గల్లా జయదేవ్ ను నిలువరించారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. గల్లా జయదేవ్ కిందపడటంతో పాటు ఆయన చొక్కా చినిగిపోయింది. గల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు రోంపిచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. చినిగిన చొక్కాతో ఆయన పోలీస్ స్టేషన్ లో నిరసనకు దిగారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!