కేటీఆర్ ఆస్తులపైన విచారణ జరపాలి..

సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ అవినీతిపైన సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.111 జీవో పరిధిలో బినామీ పేరుతో రాజమహల్ కట్టుకున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి జీవో111 సమీక్షిస్తామంటున్నారని ఆయన విమర్శించారు. 111 జీవో పరిధి నుంచి కొన్ని గ్రామాలు మినహాయింపు ఆలోచన వెనుక కుట్ర ఉంది రేవంత్ రెడ్డి ఆరోపించారు.పుప్పాల గూడాలో రూ.30 కోట్ల విలువ చేసే ఆస్తిని కోటి రూపాయలకే ఎలా కొన్నారని ఆయన ప్రశ్నించారు. 2014లో రూ.8 కోట్లు ఉన్న కేటీఆర్ ఆస్తి 2018 నాటికి 41 కోట్లకు పెరగడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ విరాళాలు 188 కోట్లకు పెరగడం వెనుక రాజకోట రహస్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.రాష్ట్రం 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే కేసీఆర్ కుటుంబం వేల కోట్లకు అధిపతులైందని ఆయన విమర్శించారు. త్యాగాల తెలంగాణలో భోగాలు అనుభవిస్తున్నారని,చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ఉద్యమాల తెలంగాణను చెరబట్టారని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.గచ్చిబౌలి, కోకాపేటల్లో వందల ఎకరాలు ఎలా సొంతమయ్యాయని లేఖలో ఆయన ప్రశ్నించారు. విచారణకు ఆదేశించకుంటే కోర్టును ఆశ్రయిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.అవినీతి బాగోతాల పై త్వరలో సమగ్ర వివరాలు, ఆధారాలతో పుస్తకం వేస్తానని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!