కేసీఆర్ మున్సిపల్ వ్యూహం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జులతో సమావేశమయ్యారు. ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాంపైన ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలు కలిసి పనిచేయాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలను తీసుకోవాలని శాసనసభ్యులకు ఆయన సూచించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి పలువురు ఎమ్మెల్యేలు చేరిన నేపథ్యంలో కొన్ని చోట్ల విభేదాలు తలెత్తాయి. ఫిరాయింపు శాసనసభ్యులు, టీఆర్ఎస్ ఇంఛార్జుల మధ్య పోటీ నెలకొనడంతో కేసీఆర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలపైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మున్సిపాలిటీల వారీగా బీఫారాలను ఎమ్మెల్యేలకు సి.ఎం అందజేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!