వంద కోట్ల బిజినెస్

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సరిలేరు నీకెవ్వరుపైన భారీ అంచనాలున్నాయి. పెద్ద బడ్జెట్ తో నిర్మించిన సినిమాకు బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లు సమాచారం. 100 కోట్ల పైగా ఈ సినిమా అమ్ముడుపోయినట్లు పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 77 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పాటు విదేశాల్లో మరో 27 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ భారీగా ఉందని చెపుతున్నారు. ఆరోగ్యకరమైన కామెడీకి పెట్టింది పేరైన అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ కావడంతో సినిమా సూపర్ హిట్ ఖాయమని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. వసూళ్లు కూడా భారీ స్థాయిలో ఉంటాయన్న అంచనాలతో సినిమా పరిశ్రమ ఉంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!