వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఆ పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కాపాడుకోవడం కష్టంగానే మారింది. ఆ పార్టీకి ఒక్కొక్కొ ఎమ్మెల్యే గుడ్ బై చెపుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే టీడీపీపైన తిరుగుబాటు చేశారు. తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి కూడా వంశీ బాటలోనే నడుస్తున్నారు. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ తో సమావేశమయ్యారు. త్వరలోనే గిరి వైసీపీ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది. అమరావతి కోసం టీడీపీ భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న సమయంలో గుంటూరు జిల్లాలో పార్టీ ఎమ్మెల్యే ఫిరాయించడం చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించింది. రాజధాని ఉద్యమానికి ప్రజల మద్దతు లేదని చెప్పించాలన్న ఉద్దేశంతోనే వైసీపీ ఈ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పాటు చంద్రబాబునాయుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరో నలుగురు సభ్యులను తమ వైపు తిప్పుకుంటే చంద్రబాబునాయుడి ప్రతిపక్ష నాయకుడి హోదా గాయబ్ కానున్నది. అయితే ప్రొటొకాల్ కు సంబంధించిన చిన్న చిన్న అంశాలు తప్ప ఈ విషయంలో బాబుకు పోయేది ఏమీ ఉండకపోవచ్చు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!