చింతమనేని ఇంటికి చంద్రబాబు

వివిధ కేసుల్లో అరెస్టు అయి 66 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్ పైన విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని ఆయనకు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు స్వయంగా దిగ్గిరాలలోని చింతమనేని నివాసానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కొద్ది సేపు గడిపారు. అక్రమ కేసులతో చింతమనేనిని వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు విమర్శించారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడికి చింతమనేని ప్రభాకర్ ఘనస్వాగతం పలికారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు చింతమనేని నివాసానికి తరలివచ్చారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!