వైవిబికి అండగా …

తెలుగుదేశం మీద తిరుగుబాటు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా క్రిష్ణా జిల్లా టీడీపీ నేతలు ఒకటవుతున్నారు. వంశీ వైఖరీపైన తెలుగుదేశం నాయకులు ఎదురుదాడి ప్రారంభించారు. ప్రధానంగా పార్టీ సీనియర్ నేత వైవిబి రాజేంద్రప్రసాద్ పైన వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు నేతలు సంఘీభావం తెలియజేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వైవీబీని కలిసి మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని. అధైర్య పడవద్దని వైవిబీకి ఆయన సూచించారు. వంశీ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నాయకులెవ్వరు తనకు మద్దతు ఇవ్వడం లేదని రాజేంద్ర ప్రసాద్ మనస్తాపం చెందారనే వార్తలు వచ్చాయి. దీంతో టీడీపీ నాయకులు ఆయనకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. మరో వైపు తనను బెదిరించడంతో పాటు అసభ్య వ్యాఖ్యల చేసిన వంశీ మీద కేసు పెట్టడానికి రాజేంద్ర ప్రసాద్ సిద్దమయ్యారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!