పయ్యావులకు చంద్రబాబు పరామర్శ

ఇటీవల అస్వస్థతకు గురైన టీడీపీ సీనియర్ నేత, శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఏంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవ్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ సోమరాజు ట్రీట్ మ్మెంట్ వివరాలను చంద్రబాబుకుతెలియజేశారు. పీఎసీ ఛైర్మన్ గా వ్యవహారిస్తున్న పయ్యావుల ఇటీవల వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు అనారోగ్యానికి గురయ్యారు. హుటావుటిన ఆయనను సెక్రటేరియట్ లోని వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని గ్యాస్ట్రో ఏంట్రాలజీలో పయ్యావుల జాయిన్ అయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో పయ్యావులు బాధపడుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!