సాహో…కొంచెం కథ..ఎక్కువ యాక్షన్

అన్నో అంచనాల మధ్య ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలైంది. భారీ బడ్జెట్ నిర్మించిన ఈ సినిమా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతాలు స్రుష్టించిన బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో మీద ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యువ దర్శకుడు సుజీత్ ను నమ్మి ఈ సినిమాలో ప్రభాస్ నటించారు.

సాహో సినిమాను ఒక్క మాటలో చెప్పాలంటే యాక్షన్ మూవీగా చూడాలి. బాహుబలి ఇమేజ్ నుంచి బయటపడటానికి ప్రభాస్ ఈ సబ్జక్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సినిమాను పూర్తిగా భారీ యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా సాహో కనిపిస్తోంది. ఐదు భాషల్లో చిత్రాన్ని నిర్మించిన నేపథ్యంలో తెలుగు వాసనలు పెద్దగా లేవనే చెప్పాలి. హిందీ సినిమా ప్రభావం సాహో మీద అధికంగా ఉంది. నటినటులు కూడా ఎక్కువ మంది తెలుగు కు సంబంధించిన వారు కాకపోవడం విశేషం. ముంబైలో 2000 కోట్ల దొంగతనంతో సాహో సినిమా ప్రారంభమౌతుంది. ఈ దొంగతనాన్ని చేధించే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను సిద్దార్థరాామ్ సాహో ఎలా ఎదుర్కొంటారన్నది ప్రధాన కథాంశం. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ఈ సీన్స్ ఉన్నాయి. అయితే స్టోరీ ప్రారంభం కావడానికి కనీసం గంట సమయం పడుతుంది. అప్పటి వరకు కొంత బోరింగ్ గా సినిమా నడుస్తుంది. అన్ని పాత్రలు ఫస్టాప్ లోనే కనిపించేలా దర్శకుడు సుజిత్ జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమాలో ప్రభాస్ , హీరోయిన్ శ్రద్దా కపూర్ మధ్య రోమాంటిక్ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. వీరి మధ్య కెమిస్ట్రీ సరిగా కుదిరినట్లు అనిపించదు. ఇంటర్వెల్ ఆకట్టుకునే ఉంది. సెకాండాఫ్ పైన ఆసక్తి కల్గించేలా ఇంటర్వెల్ ను తీర్చిదిద్దారు. పాటలు అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సాంగ్స్ విజువలైజేషన్ రిచ్ గా ఉండటం వల్ల ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమా మొత్తం యాక్షన్ నింపేయడంతో ఇతర అంశాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. రొమాన్స్, కామెడీ పార్టులు పెద్దగా ఆకట్టుకోలేదు. యాక్షన్ సన్నివేశాల భారీ తనం మాత్రం ప్రేక్షకులను కట్టిపడేశాయి. హాలివుడ్ సినిమాలు చూసే వాళ్లకు మాత్రం కాఫీ ఫేస్ట్ సీన్స్ లా సినిమా కనిపిస్తుంది. అయితే తెలుగు సినిమాకు ఈ స్థాయిలో యాక్షన్ సిక్వెన్స్ ఉండటం మాత్రం గర్వకారణమనే చెప్పాలి. టెక్నిషియన్స్ కు ఇందులో ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. సినిమా చివర్లో దాదాపు 40 నిమిషాల పాటు వచ్చే యాక్షన్ సన్నివేశాలు సాహోకే అతి పెద్ద హైలెట్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో ఇంత భారీ యాక్షన్ సీన్స్ లేవనే చెప్పాలి.

ఇక సినిమాలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. స్లైలిష్ లుక్ తో అభిమానులకు పండుగ చేశాడు. ఆజానుభావుడైన ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలను ఇరగదీశాడు. ప్రేక్షకుల కళ్ల ముందు ఉన్న బాహుబలిని మరిచిపోయేలా ప్రభాస్ నటన సాహోలో ఉండటం విశేషం. ఇటీవల విలన్ క్యారెక్టర్లుగా సినిమా పరిశ్రమలో చెలామణి అవుతున్న నటులంతా సాహోలో ఉన్నారు. మోడ్రన్ విలనీ పాత్రల డిజైన్ బాగుంది. వాజీ సిటీ సెట్టింగ్ బాగుంది. ఇక గిబ్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి. మొత్తంగా చూస్తే యాక్షన్ ను ఆశించే మాస్ మసాలా ప్రేక్షకులకు సాహో విందు భోజనం లాంటిదే. అయితే క్లాస్ ఆడియన్స్ మాత్రం ప్రభాస్ కోసమే సినిమా చూడాల్సి ఉంటుంది. దర్శకుడు సుజిత్ ప్రభాస్ ను ఒక్క యాంగిల్ లో చూసే కథ రాసుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా సాహో అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. బహుబలి రికార్డులను తిరగరాయడం కష్టమేనని సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

సాహో సినిమా రేటింగ్ .. 2.5

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!