రేవంత్ పైన తెర చాటు యుద్ధం

మ‌ల్కాజ్ గిరి ఎం.పి రేవంత్ రెడ్డి పైన రాజ‌కీయ కుట్ర జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీయ‌డానికి పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కాంగ్రెస్ లో ఆయ‌న‌ను ఎద‌గ‌కుండా కింద లాగేందుకు ప్ర‌త్య‌ర్థులు పావులు క‌దుపుతున్నారు.సొంత పార్టీలో ఆయ‌న‌పైన అనుమానాలు పెంచేందుకు ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు.ఎం.పి గా గెలిచి నెల రోజులు కాక‌ముందే రేవంత్ రెడ్డి ని రాంగ్ రూట్ ప‌ట్టించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కేడ‌ర్ తో పాటు ఆయ‌న అనుచ‌రులు, అభిమానుల్లో గంద‌ర‌గోళం సృష్టించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతున్న‌ట్లుగా ఎం.పిగా గెలిచిన మ‌రుస‌టి రోజు నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప్ర‌చారం మొద‌లైంది. ఇప్ప‌టికే బీజేపీ జాతీయ నాయక‌త్వంతో మాట్లాడిన‌ట్లు కూడా సోష‌ల్ మీడియాలో క్యాంపైయిన్ చేస్తున్నారు. ఈ ప్ర‌చారాన్ని రేవంత్ రెడ్డి గ‌ట్టి గా ఖండించారు. సోష‌ల్ మీడియాలో కావాల‌నే ఈ విధంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికి అదే ప్ర‌చారం మ‌ళ్లీ మొద‌లైంది. ఈ సారి ప‌లు టీవీ ఛాన‌ళ్ల‌లో రేవంత్ రెడ్డి పైన క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. రేవంత్ రెడ్డి తో పాటు కోమ‌టిరెడ్డి కూడా బీజేపీలో చేరుతున్న‌ట్లు పేర్కొన్నారు. వీరిద్ద‌రు ఇప్ప‌టికే బీజేపీ నేత రామ్ మాధ‌వ్ తో స‌మావేశ‌మ‌య్యార‌ని చెప్పుకొచ్చారు. త్వ‌ర‌లోనే మ‌రికొంద‌రితో క‌లిసి కాషాయ కండువా క‌ప్పుకుంటున్నార‌న్న‌ది సారాంశం. రెండు మూడు ఛానళ్ల ల్లో ఈ వార్త ప్ర‌సారం అయింది. అయితే ఈ మీడియా ఛానెళ్లు రేవంత్ రెడ్డికి వ్య‌తిరేక‌మైన‌వి కావ‌డం విశేషం. దీంతో కావాల‌నే ఆయ‌న మీద త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని అర్థ‌మౌతోంది. ఇటీవ‌లె రేవంత్ రెడ్డి ఈ మీడియాపైన విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొన్ని ఛాన‌ళ్ల‌ను బాయ్ కాట్ చేయాల‌ని కూడా ఆయ‌న సూచించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న బీజేపీలో చేరుతున్నార‌నే వార్త‌లు మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ వార్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.మ‌ల్కాజ్ గిరి ఎం.పిగా గెలిపించినందుకు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ‌మంతా తిరుగుతు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం కోసం ఏం చేయాల‌న్న దాని మీద రేవంత్ రెడ్డి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ప్ర‌స్తుతం జాతీయ‌ కాంగ్రెస్ పార్టీలో స్త‌బ్ద‌త నెల‌కొన్న‌ది. త‌న రాజీనామాను ఉప‌సంహ‌రించు కోవ‌డానికి రాహుల్ గాంధీ స‌సేమేరా అంటున్నారు. ఈ వ్య‌వ‌హారం ముగిసిన త‌ర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో మార్పులు చేర్పులు జ‌ర‌గ‌నున్నాయి.పీసీసీ ఛీప్ గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ప్పుకోవ‌డం దాదాపుగా ఖాయ‌మైంది. ఈ ప‌రిస్థితుల్లో రేవంత్ రెడ్డి కి కీల‌క బాధ్య‌త‌ల‌ను రాహుల్ గాంధీ అప్ప‌గించే సూచ‌న‌లున్నాయి.ఒక వేళ పీసీసీ ఛీప్ గా రేవంత్ రంగంలోకి దిగితే కాంగ్రెస్ కేడ‌ర్ లో మ‌ళ్ళీ ఉత్సాహం వ‌చ్చే ఛాన్స్ ఉంది.కాంగ్రెస్ యాక్టివ్ అయితే ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డికి పీసీసీ ఛీప్ ప‌గ్గాలు అంద‌కుండా ప్ర‌త్య‌ర్థులు పావులు క‌దుపుతున్న‌ట్లు అర్థ‌మౌతోంది. ఇందుకోసం ప్ర‌త్య‌క్ష యుద్ధం చేయ‌కుండా త‌మ అనుకూల మీడియాతో తెర చాటును దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం చాలా ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు కనిపిస్తోంది. 2023 ఎన్నిక‌ల యుద్ధానికి కాంగ్రెస్ ను సంసిద్దం చేయ‌డానికి ఆయ‌న సిద్ధ‌మౌతున్నార‌ని రేవంత్ అనుచ‌రులు స్ప‌ష్టం చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!