రాహుల్ కోట‌రీలోకి రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి మరింత ద‌గ్గ‌ర కానున్నారు.మ‌ల్కాజ్ గిరి ఎం.పిగా విజ‌యం సాధించిన ఆయ‌న ఇక నుంచి ఢిల్లీ పెద్ద‌ల‌కు మ‌రింత స‌న్నిహితుడు కాబోతున్నారు. ప్ర‌ధానంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీకి చేదోడు,వాదోడు నిలిచే అవ‌కాశం ఆయ‌న‌కు వ‌చ్చింది. వ‌చ్చే ఐదేళ్ల పాటు పార్ల‌మెంటులో రాహుల్ కు అండ‌గా రేవంత్ రెడ్డి నిల‌బ‌డ‌బోతున్నారు. మంచి చొర‌వ క‌ల్గిన ఆయ‌న అన‌తి కాలంలోనే రాహుల్ గాంధీకి ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు మ‌రింత స‌న్నిహితుడిగా ఆయ‌న కు అవ‌కాశం రాబోతుంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ 52 ఎం.పి స్థానాల‌ను మాత్ర‌మే గెలుచుకుంది. పార్టీ త‌రుపున పోటీచేసిన అనేక మంది ప్ర‌ముఖులు ప‌రాజ‌యం పాల‌య్యారు. గ‌తంలో రాహుల్ గాంధీకి అండ‌గా నిల‌బ‌డిన ప‌లువురు నాయ‌కులు ఈ సారి ఓట‌మిపాల‌య్యారు. పార్టీ పార్ల‌మెంట‌రీ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేనే స్వ‌యంగా అప‌జ‌యం చెందారు. ఇక స‌భ‌లో రాహుల్ గాంధీ ప‌క్క‌నే ఉంటు అన్ని విష‌యాల్లో చేదోడు వాదోడుగా నిలిచిన జ్యోతిర్యాదిత్య సింధియా ఈ సారి ఓట‌మి పాల‌య్యారు. ఢిల్లీలో స‌న్నిహితంగా ఉండే స‌చిన్ పైలెట్ రాజ‌స్తాన్ ఉప ముఖ్య‌మంత్రి గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ద్విగిజ‌య్ సింగ్, సుఖీల్ కుమార్ షిండే, అశోక్ చౌవాన్ లాంటి ముఖ్య నాయ‌కులు కూడా ఈ సారి లోక్ స‌భ‌లో అడుగుపెట్ట‌డం లేదు. ఇక ద‌క్ష‌ణ భార‌త‌దేశం నుంచి ఒక్క కేర‌ళ నుంచి మాత్ర‌మే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ల‌భించాయి. ఇక్క‌డ శశిథ‌రూర్ మాత్ర‌మే కొంత గుర్తింపు ఉన్న నాయ‌కుడు. అయితే రాహుల్ గాంధీ ఆయ‌న‌ను పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. దీంతో రేవంత్ రెడ్డి లాంటి దూకుడు స్వ‌భావం క‌ల్గిన నాయ‌కుడు త్వ‌ర‌గా రాహుల్ దృష్టిలో ప‌డే ఛాన్స్ ఉంది. ప్ర‌తిప‌క్షంగా బీజేపీని ఎదుర్కొవ‌డం కోసం వాక్ చాతుర్యం క‌ల్గిన రేవంత్ ని పార్టీ అధిష్టానం క‌చ్చితంగా ఉప‌యోగించుకోనున్న‌ది. హిందీ, ఇంగ్లీష్ లో కూడా అన‌ర్గ‌ళంగా మాట్లాడే రేవంత్ రెడ్డి క‌చ్చితంగా లోక్ స‌భ‌లో కాంగ్రెస్ కు మంది గొంతు కాబోతున్నారు. అందులోనూ కాంగ్రెస కు త‌క్కువ మంది స‌భ్యులు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ హైక‌మాండ్ దృష్టిలో ప‌డ‌టం చాలా సుల‌భం. అందుకే రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్తులో కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఎద‌గ‌డం ఖాయ‌మని ఆయ‌న అభిమానులు ఆనంద‌ప‌డుతున్నారు.

నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేరిలో రెండేళ్లు మాత్ర‌మే. చాలా త‌క్కువ స‌మ‌యంలో ఆయ‌న పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్లారు. ఇంత త‌క్కువ స‌మ‌యంలో కాంగ్రెస్ లో కీల‌క నాయ‌కుడిగా మార‌డం దాదాపుగా అసాధ్యం. రెండు, మూడు ద‌శాబ్దాల పాటు ద‌క్కామోక్కిలు తిన్న నాయ‌కులు కూడా పీసీసీ స్థాయికి ఎద‌గ‌లేక‌పోతున్నారు. కాని రేవంత్ రెడ్డి రెండేళ్ల‌లోనే పీసీసీ అధ్య‌క్షుడి రేసులోకి వ‌చ్చేశారు.కార్య‌క‌ర్త‌ల డిమాండ్ మేర‌కు ఆయ‌న‌కు క‌చ్చితంగా కీల‌క ప‌ద‌వి రానున్న‌ది. రాష్ట్ర స్థాయిలో కీల‌క పాత్ర పోషిస్తున్న రేవంత్ కు ఇప్పుడు ఎం.పి అవ‌డం ద్వారా జాతీయ స్థాయిలో కూడా ప‌ని చేసే అవ‌కాశం దొరికింది. క‌ష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కు అండ‌గా నిల‌బ‌డ‌టం ద్వారా పార్టీ అధిష్టానాన్ని ఆక‌ట్టుకునే ఛాన్స్ ఉంది. దీని వ‌ల్ల తెలంగాణ‌లో ఆయ‌న మ‌రింత ప‌టిష్టంగా ప‌నిచేసుకునే అవ‌కాశం ఉంది. రాహుల్ గాంధీకి స‌న్నిహితంగా ఉండ‌టం ద్వారా త‌న ప్ర‌ణాళిక‌ల‌ను రాష్ట్రంలో ప‌క‌డ్భందీగా అమ‌లు చేసుకునే వెసులు బాటు దొరుకుతుంది. త‌న వ‌ర్గానికి పెద్ద పీఠ వేసుకునే సదుపాయం కూడా రేవంత్ రెడ్డికి ఉంటుంది. త‌న శ‌క్తి ,సామ‌ర్థ్యాల మీద అధిష్టానానికి గ‌ట్టి న‌మ్మ‌కంగా క‌ల్గించ‌డం ద్వారా వై.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హాలో
పార్టీలో ఎద‌గ‌డానికి ఆయ‌న వెసులు బాటు ల‌భిస్తుంది. పార్టీ ఆది నాయ‌క‌త్వం కూడా ఎలాంటి ఆంక్ష‌లు పెట్ట‌కుండా ఆయ‌న‌కు ప‌నిచేసుకునే అవ‌కాశం ఇస్తుంది. మొత్తానికి మ‌ల్కాజ్ గిరి ఎం.పి గా విజ‌యం సాధించ‌డం ద్వారా త‌న భ‌విష్య‌త్తు రాజ‌కీయ జీవితానికి ఆయ‌న బంగారు బాట వేసుకున్న‌ట్లే.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!