కేసీఆర్ పైన కొండాా దంపతుల తిరుగుబాటు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసంత్రుప్త, అసమ్మతి నేతలు గోడలు దూకే పనిలో బిజిగా ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో చిచ్చు పెడుతోంది. కనీసం నలభై నియోజకవర్గాల్లో అభ్యర్థుల మీద వ్యతిరేకత వ్యక్తమౌతోంది.టిక్కెట్లు ఆశించి భంగపడిన గులాబీ నాయకులు భవిష్యత్తు కార్యాచరణ మీద ద్రుష్టి సారించారు. అభ్యర్థిత్వం కోసం ఇతర పార్టీలను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడా అవకాశం రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరో వైపు టీఆర్ఎస్ పెండింగ్ లిస్టు కూడా ఆ పార్టీలో చిచ్చు పెడుతోంది. తమకు సీట్లు ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టడంపైన సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అయితే ఇంకా అవకాశం ఉండటంతో బయటపడకుండా అధిష్టానంతో చివరి వరకు చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వరంగల్ ఈస్ట్‌ ఎమ్మెల్యే కొండా సురేఖకు మాత్రం విషయం అర్థమైంది.కావాలనే తనకు సీటు ఖరారు చేయలేదని స్పష్టం కావడంతో ఆమె తన భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. తనతో పాటు తన కూతురుకి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరడంతో టీఆర్ఎస్ లో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. కొండా దంపతులు డిమాండ్ చేయడం మంత్రి కేటీఆర్ కు ఏ మాత్రం రుచించలేదు. దీంతో సురేఖకు టిక్కెట్‌ ఇవ్వకుండా ఆయన పెండింగ్ లో ఉంచారు. అయితే పరిస్థితులను గమనించిన కొండా దంపతులు సొంత గూటికి చేరుకోవడానికి రెఢీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న వీరు శనివారం టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారు. కేసీఆర్, కేటీఆర్ వైఖరీపైన నిప్పులు చెరగడానికి సురేఖ సిద్ధమైనట్లు సమాచారం.టీఆర్ఎస్ నాయకత్వ వ్యవహారశైలిని మీడియా సమావేశంలో వివరించిన అనంతరం వీరు తమ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేస్తారు. ఈ నెల 11న కొండా దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ లో ఊపు ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!