తెలంగాణలో హంగ్…?

తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆయన దోస్త్‌ అక్భరుద్దీన్ ఓవైసీ షాక్ ఇచ్చారు. ఏకంగా కేసీఆర్ సి.ఎం పదవికే ఆయన ఎసరు పెట్టే వ్యాఖ్యలు చేశారు. వంద సీట్లు గ్యారెంటీ అన్న టీఆర్ఎస్ ప్రచారానికి ఓవైసీ గండికొట్టే ప్రయత్నాలు చేశారు.వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కింగ్ ఎందుకు కాకుడదన్న అర్థం వచ్చేలా అక్బర్ వ్యాఖ్యలు చేశారు.మజ్లిస్ పార్టీ కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందేమో అని ఆయన కామెంట్ చేయడం విశేషం.కర్ణాటకలో కుమారస్వామి సి.ఎం కాగా తెలంగాణలో తామెందుకు కాలేమని ఓవైసీ కుండబద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదన్న రీతిలో అక్భరుద్దీన్ వ్యాఖ్యలు ఉన్నాయి.టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు పూర్తి మెజార్టీ రాకపోతే మజ్లిస్ పార్టీ కింగ్ గా మారుతుందన్నది ఆయన భావన. వంద సీట్లతో కచ్చితంగా అధికారంలోకి వస్తామని కేసీఆర్ పదే పదే బల్లగుద్ది చెపుతున్న నేపథ్యంలో అక్భర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని స్పష్టం చేసినట్లు అర్థమౌతోంది. కాంగ్రెస్,టీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు ఉంటుందన్న భావనకు ఓవైసీ సోదరులు వచ్చారా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతోంది. మజ్లిస్ తమ మిత్రపక్షమని, ఆ పార్టీతో కేవలం స్నేహా పూర్వక పోటీ ఉంటుందని కేసీఆర్ ప్రకటించి రెండు రోజులు కాకముందే అక్భరుద్దీన్ ఈ ట్విస్ట్‌ ఇవ్వడం విశేషం. మరి కేసీఆర్ చెప్పినట్లు వందసీట్లు వస్తాయో లేక ఓవైసీ వ్యాఖ్యానించినట్లు హంగ్ ఏర్పడుతుందో చూడాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!