తెలంగాణ రాష్ట్రం నుంచి సిపిఎం పార్టీకి నూకలు చెల్లినట్లుగా కనిపిస్తోంది.దశాబ్దాల ఎర్ర సైనికుల త్యాగాలు,పోరాటాలను బూడిదలో పోసిన పన్నీరు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి.చట్టసభల్లో సుత్తికొడవలి నక్షత్రం ఉనికి లేకుండా చేయడానికి ఆ పార్టీ నాయకులే కంకణం కట్టుకున్నారు.కార్యకర్తల శ్రమను తాకట్టు పెట్టడానికి ఎర్రనేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.మొద్దుబారిన మస్తిష్కాల్లో నిండిన బూజుపట్టిన భావజాలం ఎర్రజెండా ఎగరకుండా అడ్డునిలుస్తోంది.నిత్యం ప్రజాపోరాటాల్లో ఉంటామని చెప్పుకునే నాయకులు ఆ జనానికి దూరం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో తమకు పాత్ర లేకుండా చేసుకోవడానికి ఎర్ర నాయకులు కంకణం కట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమానికి చెడ్డ రోజులు దాపురిస్తున్న సమయంలో ఎదురొడ్డి నిలబడాల్సిన తెలంగాణ కామ్రేడ్స్ ఫీచేముడ్ అంటున్నారు.సుత్తికొడవలిని స్వహస్తాలతో సమూలంగా పెకిలించివేయడానికి నాయకత్వం చెమటలు చిందిస్తోంది.భావజాల దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్న కమ్యూనిస్టు నాయకత్వం సామాజిక న్యాయం పేరుతో పునాదులను కదిలించుకుంటోంది.కులం,మతం లేని సమసమాజ స్థాపనే ధ్యేయంగా నడిచే ఎర్రజెండాను నాయకులు పక్కదారి పట్టిస్తున్నారు.లాల్ -నీల్ పేరుతో తెలంగాణలో సిపిఎం పార్టీ అంతర్దానికి అడుగులు వేగంగా పడుతున్నాయి.బహుజన ఫ్రంట్ అంటు ఆ పార్టీ చేస్తున్న హడావుడి చివరకు ఎర్రజెండాను పాలిపోయేలా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజస్వామ్యంలో అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. కాని సిపిఎం మాత్రం

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!