ఆ ఏడుగురు ఎమ్మెల్యేలకు నో టిక్కెట్

టీఆర్ఎస్ 105 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కేవలం ఇద్దరు సిట్టింగ్ లకు మాత్రమే టిక్కెట్ నిరాకరించింది. మరో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది.పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ప్రకటించారు. అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు. వీరికి నామినేటేడ్ పదవులు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మరో వైపు మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులపైన చర్చించాల్సి ఉందని ఆయన తెలిపారు.ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, ఇతర నాయకులతో మాట్లడిన తర్వాత వారం,పది రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. టిక్కెట్ పెండింగ్ పెట్టిన ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి కొండా సురేఖ కూడా ఉండటం విశేషం. ఆమె టీఆర్ఎస్ వదిలిపెడుతుందన్న ప్రచారం నేపథ్యంలో పక్కన పెట్టినట్లు సమాచారం. మేల్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాల్కాజ్ గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి,వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు పనితీరుపైన బాగా లేదని సర్వేలు స్పష్టం చేయడంతో కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఇతర పార్టీల నుంచి గట్టి అభ్యర్థులు దొరికితే వారికే ఇక్కడ టిక్కెట్‌ ఇచ్చే అవకాశముంది. ఇక చొప్పదండి ఎమ్మెల్యే బుడిగె శోభను పక్కన పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆమె ప్రవర్తన కారణంగానే టిక్కెట్ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. చొప్పడండికి చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడిగా కేసీఆర్ ను కలిసి శోభకు టిక్కెట్‌ ఇవ్వొద్దని కోరారు. దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. మొత్తానికి కేసీఆర్ చెప్పినట్లుగానే దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి సీట్లు దక్కాయి. దీంతో అనేక ఊహాగానాలకు తెరపడినట్లైంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!