ఎస్సై నిర్వాకం

తెెలంగాణ రాష్ట్రంలో మరో ఎస్.ఐ వివాదంలో ఇరుక్కున్నారు.భార్య,అత్తపైన దౌర్జన్యానికి పాల్పడి తీవ్రంగా గాయపర్చి మీడియాకు దొరికిపోయారు.కాపురానికి తీసుకెళ్లాలని కోరిన భార్య,అత్త మీద ఎస్.ఐ పిడిగుద్దులు కురిపించాడు.దీంతో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా మణుగూరు ఎస్.ఐ జితేందర్ చేసిన ఈ నిర్వాకం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.కరీంనగర్ జిల్లా మొగిళ్లపాడు గ్రామానికి చెందిన జితేందర్ పాల్వంచకు చెందిన పర్వీన్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వెంకటాపురంలో ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో పర్వీన్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే పెళ్లైన వారం రోజుల్లోనే జితేందర్ లో మార్పు వచ్చింది. యాభై లక్షల కట్నం తీసుకురావాలని వేధించడం ప్రారంభించిన ఆయన పర్వీన్ తో దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. పది నెలల క్రితం కుమారుడు జన్మించినా చూడటానికి జితేందర్ వెళ్లలేదు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఎస్సై విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నట్లు పర్వీన్ చెపుతోంది. అయితే జితేందర్ ను నిలదీయడానికి మణుగూరులోని ఆయన నివాసానికి పర్వీన్,ఆమె తల్లి వెళ్లారు. అయితే ఎస్సై వారిద్దరిపైన దాడికి దిగి గాయపర్చాడు. దీంతో పోలీసులు జితేందర్ పైన కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. ఎస్సై దాడి ద్రుశ్యాలు ఈ వీడియోలో చూడండి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!