టాలీవుడ్ ను వెంటాడుతున్న విషాదాలు

తెలుగు సినిమా పరిశ్రమను మరణాలు వెంటాడుతున్నాయి.అదేదో సెంటిమెంటు అన్న తరహాలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.సినిమా నటులు ఎవరైనా ప్రాణాలు విడిస్తే ఆ వెంటనే మరొకరు కూడా చనిపోవడం చాలా కాలం నుంచి వస్తోంది.అనేక సార్లు ఇలాంటి పరిస్థితి తలెత్తడం విశేషం.తాజాగా కూడా ఇలాంటి సంఘటననే జరిగింది.ప్రముఖ సినీ నటుడు నందమూరి హరిక్రిష్ణ చనిపోయిన నలభై ఎనిమిది గంటలు కాకముందే తెలుగు సినిమా పరిశ్రమకు మరో షాక్ తగిలింది.అంశ్రునయనాలతో హరిక్రిష్ణ అంత్యక్రియులు ముగిసిన కొద్ది సేపటికే టాలీవుడ్ మరో విషాదాన్ని వినాాల్సి వచ్చింది. ప్రముఖ మహిళా దర్శకురాలు, జర్నలిస్టు జయ గురువారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.యాభైనాలుగేళ్ల వయసులోనే ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన జయ నిర్మాత బి.ఎస్ రాజు సతీమణి.2003లో చంటిగాడు సినిమాతో ఆమె డైరెక్షన్ ను ప్రారంభించారు. ప్రేమికులు, గుండమ్మగారి మనవము, సవాల్, లవ్లీ ,వైశాఖం సినిమాలకు జయ దర్శకత్వం వహించారు.సూపర్ హిట్ అనే సినీ వారపత్రికను ఆమె నిర్వహిస్తున్నారు. మహిళా దర్శకురాలిని కోల్పోవడంపైన తెలుగు సినిమా పరిశ్రమ ఆవేదనను వ్యక్తం చేస్తోంది. మరో వైపు మరణాల సెంటిమెంటు కొనసాగడం కూడా టాలీవుడ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!