సంచనాలు స్రుష్టిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్

విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ సంచలనాలు స్రుష్టిస్తోంది.ఆంధ్రుల ఆరాధ్య ధైవం అన్నగారి సినిమా అందరిలోనూ ఆసక్తిని నింపుతోంది. ఎన్టీఆర్ జీవిత కథను తెరపైన చూడటం కోసం ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.రామారావు తనయుడు బాలక్రిష్ణ స్వయంగా తన తండ్రి పాత్రను పోషిస్తున్నారు.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పట్టాలెక్కింది. ఎన్టీఆర్ బయోపిక్ లో పలువురు ప్రముఖ సినీనటులు కనిపించే అవకాశాలున్నాయి. మోహన్ బాబు,డాక్టర్ రాజశేఖర్ తో పాటు యువనటుడు శర్వానంద్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఇదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ను తన తండ్రి క్రిష్ణ పాత్రలో నటించాల్సిందిగా డైరెక్టర్ క్రిష్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మహేష్ నుంచి అంగీకారం రాలేదని సమాచారం. మహేష్ ఈ పాత్రలో నటిస్తే ఎన్టీఆర్ బయోపిక్ అంచనాలు రెట్టింపయ్యే ఛాన్స్ ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనమడు నాగచైతన్య యాక్ట్ చేసే అవకాశాలున్నాయి. మరో వైపు ఎన్టీఆర్ బయోపిక్ కు విదేశాల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ సినిమాను భారీ మొత్తంతో కొనుగోలు చేయడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. 13 కోట్ల వరకు చెల్లించడానికి ఈ సంస్థలు ముందుకువచ్చాయని తెలుస్తోంది. బాలక్రిష్ణ సినిమాల్లో అత్యధిక వసూలు ఎన్టీఆర్ బయోపిక్ వస్తాయని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!