జైలుకు రాజ్ తరుణ్ తండ్రి

                టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ తరుణ్ తండ్రి జైలు పాలయ్యారు. ఆయనకు విశాఖ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నకిలీ బంగారం కుదువ పెట్టి రుణం తీసుకున్న కేసులో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజుకు ఈ శిక్ష పడింది. ఇరవై వేల రూపాయల జరిమానాను కూడా కోర్టు విధించింది. సింహాచలం ఎస్ బీఐ బ్రాంచిలో అసిస్టింట్ క్యాషియర్ గా  బసరరాజు పనిచేసేవారు. అయితే తన భార్య రాజ్యలక్ష్మితో పాటు మరో నాలుగురు పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆయన 9.85 లక్షల లోన్ తీసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన తనిఖీల్లో ఆయన తాకట్టు పెట్టింది నకిలీ బంగారమని తేలింది. దీంతో బసవరాజుపైన పోలీసు కేసు నమోదైంది. తండ్రికి జైలు శిక్ష పడటంతో రాజ్ తరుణ్  ఆందోళనలో ఉన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!