పేరు మార్చుకున్న శ్రీ రెడ్డి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలు స్రుష్టిస్తున్న నటి శ్రీ రెడ్డి తన పేరు మార్చుకున్నారు. తన పేరులో రెడ్డి ఉండటం తనకు ఇబ్బందిగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇక ముందు తనను శ్రీ రెడ్డిగా పిలువవద్దని ఆమె మీడియాకు సూచించారు. తన పేరును శ్రీ శక్తిగా మార్చుకుంటున్నట్లు ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో ప్రకటించారు. రెడ్డి వర్గం నుంచి తీవ్రమైన విమర్శలు వస్తుండటంతో శ్రీ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు  తన సామాజిక వర్గానికే రెడ్డి దిల్ రాజుపైన ఆమె విమర్శలు గుప్పించారు. థియేటర్లను గుప్పిట్లో పెట్టుకొని సినిమా పరిశ్రమను ఆడిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వెంటనే వారి నుంచి థియేటర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని శ్రీ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో సినిమా పరిశ్రమలో అమాయకపు అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వారిపైన తన పోరాటం కొనసాగుతుందని శ్రీ రెడ్డి ప్రకటించారు.

 

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!