శ్రీరెడ్డి చేస్తుంది పోరాట‌మా..? బ్లాక్ మెయిలింగా..?

గ‌త కొన్ని రోజుల‌గా మీడియాలో మారుమోగిపోతున్న పేరు శ్రీ‌రెడ్డి. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో తెలుగు అమ్మాయిల‌కు స‌రైన అవ‌కాశాలు ఇవ్వ‌డంలేదంటూ మీడియాలోకి వ‌చ్చిన శ్రీ‌రెడ్డి పోరాటం కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని చెప్పిన శ్రీ‌రెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు హీరోయిన్స్ ను అణ‌గ‌దొక్కుతున్నార‌ని ఆ త‌ర్వ‌త ఆరోపించింది. దాదాపు రెండు నెల‌లుగా మీడియా చ‌ర్చ‌ల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీ‌రెడ్డి తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అమ్మాయిల‌ను వాడుకుని వ‌దిలేస్తున్నారు త‌ప్ప అవ‌కాశాలు క‌ల్పించ‌డం లేద‌ని ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పించింది. రాను రాను త‌న‌కు మూవీ ఆర్టిస్టు అసోసియేష‌న్ గుర్తింపు కార్డు ఇవ్వ‌డంలో వివ‌క్ష చూపిస్తోందంటూ వినూత్న‌రీతిలో నిర‌శ‌న తెలిపింది శ్రీ‌రెడ్డి. త‌ర్వాత రెండు రోజుల‌కు ప్ర‌ముఖ నిర్మాత కుమారుడు త‌న‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని చెప్పి శారీర‌కంగా వాడుకున్నాడ‌ని చెబుతూ అత‌నితో దిగిన సెల్ఫీలను మీడియాకు విడుద‌ల చేసింది. త‌ను స‌న్నిహింతంగా ఉన్న ఫోటోల‌నే కాకుండా కొంత‌మంది ప్ర‌ముఖుల వాట్స‌ప్ సంభాష‌ణ‌ల‌ను కూడా విడుద‌ల చేసింది. దీంతో శ్రీ‌రెడ్డి చేస్తున్న పోరాటం దేనికోస‌మ‌నే సందేహం మొద‌లైంది.

త‌న‌కు “మా” స‌భ్య‌త్వం ఇవ్వ‌డంలేదు., సినీ ప‌రిశ్ర‌మ తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంలేదు దీని పైనే త‌న పోరాటం అన్నంత వ‌ర‌కు శ్రీ‌రెడ్డి ని ప్రేక్ష‌కులు అభినందించారు. తాను ఫిల్మ్ న‌గ‌ర్ “మా” కార్యాలయం ముందు చేసిన నిర‌శ‌న‌కు కూడా పెద్ద‌యెత్తున స‌ఘీభావం ప్ర‌క‌టించారు. మ‌హిళా సంఘాల‌నుండి కూడా శ్రీ‌రెడ్డికి మంచి మ‌ద్ద‌త్తు ల‌భించింది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా శ్రీ‌రెడ్డికి స‌భ్య‌త్వం ఇవ్వాల్సిందేన‌ని చెప్ప‌డ‌మే కాకుండా “మా” కార్య‌వ‌ర్గాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇంత‌వ‌ర‌కు శ్రీ‌రెడ్డి ఎపిసోడ్ మీడియాలో ఇంట్రెస్టుగానే న‌డిచింది. ఎప్పుడైతే తాను ప్ర‌ముఖ నిర్మాత కుమారుడి ఫోటోను విడుద‌ల చేసిందో ఆ క్ష‌ణం నుండి శ్రీ‌రెడ్డి చేస్తున్న పోరాటం పై సందేహాలు మొద‌ల‌య్యాయి. శ్రీ‌రెడ్డి తెలుగు అమ్మాయిల అవ‌కాశ‌ల కోసం ఉద్య‌మం చేస్తుందా లేక మ‌రో కోణం ఉందా అనే అనుమానాలు త‌లెత్తాయి. తాను విడుద‌ల చేసిన‌ సంభాష‌ణ‌లు గాని, ఫోటోలు గాని తాను ఇష్ట‌ప‌డి చేసిన‌ట్టుగా ఉన్నాయి త‌ప్ప బ‌ల‌వంతపెట్టి తీసిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. సినీ ప్ర‌ముఖుల‌తో శ్రీ‌రెడ్డి సంభాష‌ణ కూడా ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో మాట్లాడుకున్న‌ట్టు ఉంది త‌ప్ప బెదిరించిన‌ట్టో, ఒప్పించిన‌ట్టో, బాదించిన‌ట్టో లేవు. అలాంట‌ప్పుడు శ్రీ‌రెడ్డి ప‌రిశ్ర‌మ‌లోని ఎదుటి వ్య‌క్తుల‌ను ఎలా త‌ప్పు ప‌డుతుంది? ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర‌నుండి, నిర్మాత‌ల కొడుకుల వ‌ర‌కు స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించి త‌ర్వాత వాళ్ల‌పైనే అరోప‌ణ‌లు చేయ‌డం శ్రీ‌రెడ్డికి ఎంత‌వ‌ర‌కు భావ్య‌మో చెప్పాలి..! సినిమా అవ‌కాశాలు అనేది పూర్తిగా ప్ర‌తిభ మీద ఆదార‌ప‌డి ఉంటుంది. బెదిరించో., బ్లాక్ మెయిల్ చేసో., వయ్యారాలు వ‌ల‌క బోసో అవ‌కాశాలు కొట్టేయాల‌నుకోవ‌డం ఉత్త భ్ర‌మ‌.

హాలీవుడ్ నుండి టాలీవుడ్ వ‌ర‌కు సినీ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల వేట జ‌రుగ‌తూనే ఉంటుంది. కాని దానికి నిర్దిష్ట‌మైన కొల‌మానం అంటూ ఏమీ ఉండ‌దు. ఇదే ప‌రిశ్ర‌మ‌లో అత్యంత అంద‌గ‌త్తెల‌కు అవ‌కాశాలు దొరక్క పోవ‌చ్చు.. సాదాసీదా అమ్మాయిల‌కు అద్బుత అవ‌కాశాలు రావొచ్చు.. అవ‌కాశాలు రానంత‌మాత్రాన ప‌రిశ్ర‌లోని నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు త‌ప్పుచేస్తున్న‌ట్టా..? అలా అని వాళ్ల మీద యుద్దం ప్ర‌క‌టిస్తారా..? ఇదెక్క‌డి వింత విచిత్ర వాదన‌..? ఇదే సినీ ప‌రిశ్ర‌మ‌లో రోజుకు కొన్ని ల‌క్ష‌ల మందికి జీవ‌నోపాది దొరుకుతుంది. అంద‌రూ సినీ క‌ళామ‌త‌ల్లి అంటూ గౌర‌వంగా సంభోదిస్తుంటారు. ఆర్టిస్టుగా అవ‌కాశాలు రాక‌పోతే అప్ప‌టి వ‌ర‌కు స‌న్నిహితంగా ఉన్న‌వారు శ‌త్రువులుగా మారిపోతారా..? అవ‌కాశాల కోసం వెంప‌ర్లాడుతున్న‌ప్పుడు మ‌న‌లోని స‌త్తా, సామ‌ర్థ్యం ఏంట‌ని కూడా ఆత్మ ప‌రిశీల‌నచేసుకోవాలి. ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో అవ‌కాశాలు రావ‌డానికి.., బెదిరించి అవ‌కాశాలు పొంద‌డానికి చాలా వ్య‌త్యాస‌ముంటుంది. ఉద్య‌మం చేసి, పోరాటం చేసి అవ‌కాశాలు పొంద‌గ‌లిగితే అవి ఎంత‌వ‌ర‌కు నిలుస్థాయ‌నేది కూడా పాయింటే..! ఇంత‌వ‌ర‌కూ మీడియాలో అవ‌కాశాల గురించి అనేక అంశాలు వ‌ర్ణించిన శ్రీ‌రెడ్డి ఉస్మానియా విద్యార్థుల మ‌ద్ద‌త్తు తో ఏం సాదింస్తుందో ఆవిడకే వ‌దిలేయాలి. తెలుగు సిని ప‌రిశ్ర‌మ పై శ్రీ‌రెడ్డి ది పోరాట‌మా..? బెదిరింపా..?? అన్నది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!